Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

''మనకు బట్ట కావాలి, తిండి కావాలి, ఇల్లుకావాలి, ఇవన్నీ అందరకు అవసరమే. ఏ తంటాలు పడినా ఇవన్నీ, ఎవరో ఒకరు ఇస్తున్నారు. ఒక మెతుకు ఒక్క అరటి ఆకు, ఒక్క విస్తరి మనం చేయగలమా? ఎవడో ఒకడు చేసి, ప్రకృతిలో మన శక్తికి మించిన శక్తిసంపన్నుడు ఎవడో ఒకడు సిద్ధంచేసి, క్రిమికీటకాదులు లగాయతు మానవుల వరకు కావలసిన సర్వం అందిస్తున్నాడు.

అన్నీ బజారులో కొన్నాం అనుకోకూడదు. బజారులో వాడికి ఎవరిచ్చారు? ఇది యెక్కడ పుట్టింది? ఆశక్తిని యెవరిచ్చారు? ఆనీళ్ళు ఎవరిచ్చారు? ఆ విత్తనాలు, చెట్లు ఎవరు సృష్టించి, రక్షిస్తున్నారు? ఎవరు పాలిస్తున్నారు? కాబట్టి అంతటికీ కారణభూతుడైన భగవంతుని స్మరించి, వానికి సమర్పించి అనుభవించుట మన అందరి ధర్మం''

- శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి.


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page